సూ…
సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు…
వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు…
లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే…
ఇంకో వందేళ్ళు
శాటిలైటుకైనా
చిక్కరు…
వీళ్లో గల్లీ రాకెట్లు
డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు
సుద్దాపూసలు సొంటే మాటలు…
తిండికి తిమ్మ రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు…
పనికి పోతురాజులు
సూ…
సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు…
వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు…
లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే…
ఇంకో వందేళ్ళు
వీళ్ళతోటి
పోల్చామంటే… ధర్నా చేస్తై కోతులు
వీళ్ళుగాని జపం చేస్తే…
దూకి చస్తై కొంగలు
ఊరిమీద పడ్డారంటే…
ఉరేసుకుంటై వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డయంటే…
మిగిలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు…
ఫ్రీ వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తరు…
బాటిల్ నే ఇప్పిస్తే
సూ…
సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు…
వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు…
లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే…
ఇంకో వందేళ్ళు
వీళ్ళు రాసిన
సప్లిమెంట్లతో… అచ్చెయ్యొచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని…
గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు…
ఎయ్యరు గనక బిచ్చము
ఇజ్జత్కి సవాలంటే…
ఇంటి గడప తొక్కరు
బుద్ధి గడ్డి తిన్నారంటే…
దొడ్డి దారి ఇడవరు
భోళా..! హరిలోరంగ
ఆ మొఖం…
పంగనామాలు వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం…
గప్పాలు అర్రాచకం
బాబో..! ఎవనికి మూడుతుందో…
ఎట్టా ఉందో జాతకం
Jathi Ratnalu is a 2021 Indian Telugu-language comedy-drama film written and directed by Anudeep KV Produced by Nag Ashwin under Swapna Cinema, the film stars Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, and Faria Abdullah while Murali Sharma, Brahmanandam and Naresh play supporting roles. The plot follows three happy-go-lucky men who arrive in the city for a better life but land up in jail for a crime they didn't commit. Released theatrically on 11 March 2021, the film went on to become a blockbuster at the box office.