ఆశా పాశం సాంగ్ తెలుగు లిరిక్స్
మూవీ:కేర్ ఆఫ్ కంచరపాలెం
మ్యూజిక్ : స్వీకర్ అగస్తి
సింగర్ : అనురాగ్ కులకర్ణి
లిరిక్స్ : విశ్వ
ఆశా
పాశం బంధీ
సేసేలే
సాగే
కాలం ఆడే ఆటేలే
తీరా
తీరం సేరే లోగానే
ఏ తీరౌనో
సేరువైనా సేదు దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో
కాదో తేలేలోగానే
ఎదేటౌనో
ఆటు పోటు గుండె
మాటుల్లోనా...
సాగేనా…
ఏ లే లే లే లో...
కల్లోలం ఈ లోకంలో
లో లో లోలోతుల్లో
ఏ నీళ్ళో ఎద కొలనుల్లో..
నిండు పున్నమేల
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లి పోతుంటే
నీ గమ్యం గంధరగోళం..
దిక్కు తోచకుండ
తల్లడిల్లిపోతు
పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదుటి
రాతల్ని
మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే
నీ ఉనికి ఉండాలిగా…
ఓ.. ఆటు పోటు
గుండె మాటుల్లోనా
సాగేనా....
ఆశా పాశం బంది సేసేలే
సాగే
కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరే లోగానే
ఏ తీరౌనో
ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో..
ఏ మలుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో..
సిగ్గు ముళ్ళు గప్పి
రంగు లీనుతున్న
లోకమంటే పెద్ద నాటకమే
తెలియకనే సాగే కథనం...
నీవు పెట్టుకున్న
నమ్మకాలు అన్ని
పక్కదారి పట్టి పోతుంటే
కంచికి నీ కథలే దూరం ...
నీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా…
ఓ... ఆటు పోటు
గుండె మాటుల్లోనా...
ఉంటున్నా...
It was screened at the New York Indian Film Festival, and the Indian Film Festival of Melbourne. It was honored with "Best Film Award" at the "Critics' Choice Festival of Indian films" in Mumbai, the "Caleidoscope Indian Film Festival" in Boston, where in the lead actor Subba Rao received the "Best Actor" honor,[ and Film Companion's "25 Best Telugu Films of the Decade".[ The film was remade in Tamil as C/o Kaadhal (2021).