Tuesday, 13 July 2021

Yemunnave Pilla Song Lyrics In Telugu

Song: Yemunnave Pilla Singer: SidSriram Lyrics-Music:PR



లేత లేగదూడ పిల్ల తాగే
పొదుగులోని పాల రంగు నువ్వే
పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నవే
నింగి సాటుకున్న సినుకు నువ్వే
సూటిగా దూకేసి తాకినావే
ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే
ఓ… మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే
సీకటి ధాటినా సెందురుడు… దాగే లాగా ఏమున్నవే

ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… తొలి సినుకు సేరి
ఈ నేల గాలి గుప్పించే… మట్టి సువాసన నీది
పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే… పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది
నువ్వు నడిసే నడకల్లో… నది పొంగుల హంగుంది
లేత నడుము మడతల్లో.. ఈ మాయల మనసుంది
వాలే రెండు కన్నుల్లో… బోలెడంత సిగ్గు దాగుంది
వాలుజడ గుత్తుల్లో… ఈ భూగోళం మొత్తముంది

హే..! ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… ఎగిరేటి సిలకా గోరింక వంక… ఓరా కన్నేసి సూసింది సూడు
తరిగేటి సొగసా కాదేమో బహుశా… అయినా నవ్వేసి వచ్చింది నేడు
కారుమబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుంది
ఆరుబయట వాకిట్లో… ఆ సుక్కల ముగ్గుంది
జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల అడ్డుంది
వెంటవచ్చే అడుగుల్లో జన్మజన్మల తోడుంది

Sithara Sirapadu song lyrics in Telugu

సినిమా:  అల వైకుంఠపురములో గానం:  సూర్రన్న, సాకేత్ కె సంగీతం:  తమన్ ఎస్ సాహిత్యం:  విజయ్ కుమార్ భల్ల సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్ట...